Ninnele - radhe Shyam song lyrics

NINNELE – Radhe Shyam Song Lyrics – Anurag Kulkarni, Shreya Ghoshal

ప్రభాస్ మరియు పూజా హెగ్డే నటించిన భారతీయ బహుభాషా చిత్రం రాధే శ్యామ్ నుండి నిన్నేలేరాధే శ్యామ్ పాట లిరిక్స్ (తెలుగు). అనురాగ్ కులకర్ణి, శ్రేయా ఘోషల్ పాడిన పాట మరియు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, జస్టన్ ప్రభాకరన్ సంగీత దర్శకత్వం వహించారు.

నిన్నెలే పాట వివరాలు:
పాట: నిన్నేలే
చిత్రం: రాధే శ్యామ్ (తెలుగు)
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రేయా ఘోషల్
సాహిత్యం: కృష్ణకాంత్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే
సంగీతం లేబుల్: T సిరీస్ తెలుగు

English | తెలుగు

Ninnele Radhe Shyam Song Lyrics in Telugu

నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే

నే నిన్నటి రవినే
నువు రేపటి శశివే
నేనంటూ వెళ్ళాకే
నువ్వొస్తావు పైకే

ఇది తప్పని మజిలీ
ఇది జాముల బదిలీ
నువే వెన్నెలే

నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే

హా ఆ ఆఆ ఆ ఆహ ఆ ఆఆ ఆ
హా ఆ ఆఆ ఆ హా ఆఆఆ
నీవల్లే నీవల్లే నేనే ఉన్నాలే
పోవద్దు ఆ దూరమే
వస్తాలే వస్తాలే నేను వస్తాలే
నువ్వెళ్ళే ఆ తీరమే

నేనడిగే చిన్ని సాయమే
చినగనే లేదు నీకు సమయమే
సాయం అడిగే పనే నీకు లేదే
అవధులు లేని అనంతం నువ్వే

నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే

నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే


Ninnele Video Song – Radhe Shyam

Radhe Shyam Movie Songs Lyrics:

Related Posts